బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకో కథ మొదలవుతుంది. అయితే ఇది మాత్రం 'చిన్న కథ కాదు'. హౌస్ లో ఇప్పుడు జరుగుతున్నవి చూస్తే ఎన్ని సినిమాలు అయిన తియ్యచ్చు.. ఇప్పటివరకు ఎక్కడ లేని విచిత్రమైన ప్రేమకథలు జరుగుతున్నాయి.
ఏ సీజన్ లో ఇన్ని లవ్ స్టోరీలు జరగలేదు. హౌస్ నుండి వెళ్ళిపోయిన కిర్రాక్ సీతకి నిఖిల్ అంటే క్రష్ అని ఒకానొక సందర్భంలో చెప్పేసింది. అయితే అదే రూట్ లో సోనియా కూడా వెళ్ళింది. మొదట్లో హౌస్ లో సోనియా ఉన్నంతసేపు పృథ్వీ, నిఖిల్ ల మధ్య ట్రాయాంగిల్ లవ్ స్టోరీని నడిపించిందని సోనియాని అనగా.. ఇప్పుడు అది యష్మీ మీదకి వచ్చింది. కన్నడ పాప యష్మీ తన అటిట్యూడ్ విత్ బ్యూటీ తో అందరిని ఆకట్టుకుంటుంది. మొన్న యష్మీ దగ్గరికి గౌతమ్ వచ్చి.. నువ్వే అందరి కంటే క్యూట్ గా ఉంటావంటూ ప్రపోజ్ చేసాడు. అయితే యష్మీ కి నిఖిల్ అంటే ఇష్టం. దాంతో అప్పుడు గౌతమ్ పట్ల ఏం స్పందించలేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ దగ్గరికి యష్మీ వచ్చి.. తన మనసులో మాట చెప్పకనే చెప్పింది. అప్పుడు రియాక్ట్ కానీ నిఖిల్.. యష్మీ కిచెన్ దగ్గర ఉంటే వచ్చి తనకి ముద్దు పెడతాడు. అంటే తనకు ఇష్టమేనని నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో టాస్క్ లు అన్ని అయిపోయాక గౌతమ్ తన క్లాన్స్ తో డిస్కషన్ చేస్తుంటాడు. అప్పుడే యష్మీ, నబీల్ అక్కడికి వస్తారు. ఎవరు నీకు అన్నం తినిపిస్తానని అన్నారని యష్మీతో నబీల్ అంటాడు. ఇక మన మెగా చీఫ్ గౌతమ్.. నేనే అంటు యష్మీ వెనకాలే వెళ్ళిపోతాడు. నేను తినిపిస్తానంటూ అవినాష్ కూడా వెళ్తాడు. ఇదంతా చూసి హౌస్ మేట్స్ అంతా కలిసి యష్మీ, గౌతమ్ లని ఆట పట్టిస్తుంటారు. యష్మీ అటు నిఖిల్ తో ఇష్టమని చెప్పి.. ఇటు గౌతమ్ కి హోప్స్ క్రియేట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే యష్మీ ఎవరిని లవ్ చేయడం లేదని, హౌస్ లో ఉండేందుకే రెండు ట్రాక్ లు వేసిందని మరికొందరు అంటున్నారు. మరి తన బిహేవియర్ మీకేలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.